విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడోసారి జతకట్టిన చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌కు ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హిట్ పెయిర్, హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
‘రణబాలి’ సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా పీరియాడికల్ జానర్‌లో రూపొందుతోంది. షూటింగ్ ప్రారంభమైన వెంటనే సెప్టెంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం కారణంగా షూటింగ్‌కు విరామం పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11 నాటికి చిత్రాన్ని పూర్తి చేయడం కష్టమవుతుందని మేకర్స్ భావిస్తున్నారని, త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.








