E-PAPER

ఒకే జానర్‌లో సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు: అజయ్ భూపతి

‘శ్రీనివాస మంగాపురం’ సినిమా జూలై 30న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అజయ్ భూపతి తన సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు, కథ చెప్పే విధానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని కోరుకుంటానని, ఒకే తరహా జానర్‌లో సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు.

తన సినిమాల్లో క్లైమాక్స్‌లో మ్యాజిక్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిందని, కానీ ప్రతి సినిమాకు ముందుగానే ట్విస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాయడం సరైన పద్ధతి కాదని అజయ్ భూపతి అన్నారు. “ఒకే రుచితో హోటల్ నడపలేం.. కొంతకాలం తర్వాత ప్రేక్షకులు కొత్త రుచులను కోరుకుంటారు. అలాగే సినిమాల్లో కూడా ఒకే జానర్‌లో కొనసాగితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది” అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News