కరకగూడెం నుంచి 10 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక
మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల ప్రజా భవన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
కరకగూడెం మండలానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పది కుటుంబాలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారిని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సాదరంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జాడి శ్రీను, బరపాటి వెంకన్న, కోర్స ఆనంద్, మైనార్టీ అధ్యక్షుడు రహీం పాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 810









