E-PAPER

అందెశ్రీ మృతి పట్ల సంతాపం వ్యక్తపరచిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

తేదీ : 10-11-2025 | మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా భవన్‌లోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ ఆకస్మిక మరణంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” ద్వారా అందెశ్రీ తెలంగాణ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆ గేయం కోట్లాది తెలంగాణ ప్రజల గొంతుకగా మారిందని, ఆయన మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటు అని తెలిపారు.

తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని ఆవేదన వ్యక్తం చేసిన పాయం వెంకటేశ్వర్లు అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిలో దుర్గం రామచందర్, శ్రీనివాసచారి, పీరినాకి నవీన్, శివ సైదులు, తరుణ్ రెడ్డి, ఎగ్బాల్ హుస్సేన్, సౌజన్య, సతీష్, ఈశ్వర్ రెడ్డి, కూచిపూడి బాబు, రహీం భాషా తదితరులు ఉన్నారు.

✍️ పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
#అందెశ్రీ #పాయం వెంకటేశ్వర్లు #పినపాక #మణుగూరు #తెలంగాణసాహిత్యం #జయజయహేతెలంగాణ #Y7NewsTelugu

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News