కరకగూడెం, జూలై 21 (వై7 తెలుగు న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు పడిగా సమ్మయ్య మాతృమూర్తి పడిగా ముసలమ్మ ఇటీవల మరణించారు. ఆమె దశదిన కర్మల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబానికి అండగా నిలిచారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 50 కిలోల బియ్యాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే మండల నాయకులు గొగ్గలి రవి, జలగం కృష్ణ కలిసి మరో 25 కిలోల బియ్యాన్ని అందించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోలెం రమేష్, అరెం నరసింహారావు, ఎం.డి. హకీం, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– రిపోర్టర్ దిలీప్, కరకగూడెం








