ఆదివాసీ గర్జనను భగ్నం చేసేందుకు కూటమి పోలీసుల కుట్రలు విఫలం
రంపచోడవరం ( వై7 న్యూస్) జూలై 20: పోలవరం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా ఆదివాసీలు 3 జీవో పై *ఆదివాసి గర్జన* భారీ బహిరంగ సభ విజయవంతమైనది. 11 మండలల నుండి ఆదివాసీ బిడ్డలు స్వచ్ఛందంగా సభకు తరలి వెళ్ళారు. అడుగు అడుగున కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆదివాసీలను సభ భగ్నం చేసుకుందుకు పన్నిన కుట్రను, ఆదివాసీ నాయకులు ఎక్కడికి అక్కడ తిప్పికొట్టారు. ఆదివాసీ నాయకులను నిర్బంధం చేయాలనే ప్రయత్నం విఫలం అవ్వడంతో ఏమి చేయలేక పోలీసులు చేతులెత్తేశారు.పాడేరులో జరిగిన భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ఆదివాసీలు హాజరు అయిన పరిస్థితిను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీసుల యంత్రాంగం ఆదివాసీలను నిర్బంధాన్ని కట్టుదిట్టం చేసిన విఫలం అయ్యారు అని చెప్పవచ్చు. ఎన్నికల హామీలలో ఇచ్చిన 3 జీవో కు ప్రత్యామ్నాయంగా మరోక జీవో ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదివాసీ నాయకులు ఆదివాసీ గర్జన బహిరంగ ద్వారా కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రత్యామ్నాయ జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వాలు, అధికారులు ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారు. చట్టాలను రక్షించాల్సిన అధికారులు చట్టాన్ని తుంగాలో తొక్కుతున్నారు. ఐదొవ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఆదివాసి చట్టాల్ని పకడ్బందీగా అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు.








