E-PAPER

సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

నేషనల్ కోఆర్డినేటర్ జన్నా స్వర్ణలత ఆధ్వర్యంలో

అశ్వాపురం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండల పరిధిలో సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు కుటుంబాలకు చేయూత అందించడమైంది.

1️⃣ కుమ్మరి కుంట్ల వీరభద్ర కుటుంబం:
సఖి సభ్యురాలి భర్త వీరభద్రకు ఇటీవల షుగర్ తీవ్రంగా పెరగడం వల్ల వైద్యులు మోకాలి వరకు కాలు తొలగించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేస్తూ సఖి మహిళా మండలి ఆర్థిక సహాయం అందించింది.

2️⃣ మొద్ద బైన రాములమ్మ కుటుంబం:
ఇటీవల మరణించిన రాములమ్మ కుటుంబానికి కూడా సఖి మండలి నిత్యావసర సరుకులు అందించింది.

ఈ కార్యక్రమాన్ని సఖి మహిళా మండలి నేషనల్ కోఆర్డినేటర్ జన్నా స్వర్ణలత నేతృత్వంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ ప్రతినిధి భోగినేని వరలక్ష్మి, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల సుజాత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గైని లక్ష్మీబాయి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పెంట్యాల దీప్తి చౌదరి, నేషనల్ జాయింట్ సెక్రటరీ అడపా సత్యవతి, నేషనల్ సెక్రటరీ చిలకపత్తిని పద్మ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News