E-PAPER

జాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పాఠశాల స్థాపించడం గర్వకారణం

సమాజానికి ఉపయోగపడేలాగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

తక్కువ ఫీజులతో నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం సంతోషం

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి

వెల్దుర్తి జూన్13 వై సెవెన్ న్యూస్

మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామ శివారులో జాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పాఠశాల స్థాపించడం గర్వకారణంగా ఉందని టి పి సి సి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం జాన్ ఫౌండేషన్ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మాసాయిపేట మండలం రామంతపూర్ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు పాఠశాల ఏర్పాటు చేసినందుకు జాన్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉత్తమమైన బోధనలు ఉత్తమమైన ఉపాధ్యాయుల చేత బోధించాలని సూచించారు. నేటి సమాజంలో విద్యార్థుల కు ఉత్తమమైన విద్యను అందించడంలో టీచర్లు విఫలం చెందారని అన్నారు. విపత్తు కాలములో ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన మేధాసంపతిని విద్యార్థుల కు పెంపొందించి సమాజానికి అందించాలని సూచించారు. జాన్ ఫౌండేషన్ ప్రతినిధి సజ్జి కే జాన్ మాట్లాడారు. ఆశాజ్యోతి ఫౌండేషన్ 2007 నుండి సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతుందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల పిల్లలు మంచి నైపుణ్యమైన విద్యను కోల్పోవద్దని సదుద్దేశంతో జాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నెలకొల్పడం జరిగిందన్నారు. మా పాఠశాలలో  అనుభవజ్ఞులైన టీచర్లతో ఉత్తమమైన విద్యను బోధించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో 27 ట్యుటోరియల్ సెంటర్లు ఉన్నాయని 650 మంది తక్కువ ఫీజుతో విద్యను అభ్యసిస్తున్నారు అని గుర్తు చేశారు. ఇటీవలనే 14 వేల మంది విద్యార్థులకు పట్టభద్రులుగా పట్టాలనందుకొని వివిధ సంస్థలలో ఉద్యోగులుగా కొనసాగుతున్నారని అన్నారు. 89% మా స్కూల్లో చదివి ఉద్యోగాలు పొందారని అన్నారు. 50 శాతం తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయిన పేద విద్యార్థులకు ఉచితంగా ఎన్జీవో ద్వారా విద్యను అందిస్తామని అన్నారు ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తక్కువ ఫీజుతో ఉత్తమమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. మా పాఠశాలలో చదువుకొని ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంచల్ జాన్ ప్రిన్సిపాల్ నిర్మల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News