వెంటనే చికిత్స అందించిన పశువుల డాక్టర్ టీం
మణుగూరు, జూన్ 3 (వై 7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బస్సు డిపో సమీపంలో ఓ ఆవు దూడ సృహ తప్పి కుప్పకూలిన ఘటన స్థానికులను కలచివేసింది. వెంటనే స్థానికులు భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, NHRC కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రమేష్ కి సమాచారం అందించగా, ఆయన తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్నారు.
రమేష్ ఈ విషయంను మణుగూరు పశువుల డాక్టర్‌కు తెలియజేయగా, డాక్టర్ వెంటనే తన కంపౌండర్ వీరభద్రం గారిని అక్కడికి పంపించి ఆవు దూడకు తగిన వైద్యం అందించాల్సిందిగా చర్యలు చేపట్టారు. కంపౌండర్ వీరభద్రం గారు సకాలంలో స్పందించి బాధిత దూడకు చికిత్స అందించడం విశేషం.
ఈ సందర్భంగా లింగంపల్లి రమేష్ మాట్లాడుతూ,”సమాచారం ఇచ్చిన స్థానికులకు, తక్షణ స్పందనతో సేవలందించిన పశువుల డాక్టర్ కి, కంపౌండర్ వీరభద్రం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.









