E-PAPER

రజక వృత్తుల సంఘంలో 30 కుటుంబాలు చేరిక

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం(టి ఆర్ వి ఎస్) భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: జూన్ 2

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు రజక ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం సీతారామపురం మరియు గొల్లగూడెం గ్రామాల 30 రజక కుటుంబాలు రజక వృత్తిదారుల సంఘంలో చేరడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా అక్కినపల్లి నారాయణ, అధ్యక్షునిగా సైదులు, కార్యదర్శిగా నాగేంద్ర బాబు, ట్రెజరర్ గా నరేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వెంకన్న, రాజు, గణేష్ నియమించడం జరిగింది.

జిల్లాలో రజకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ముదిగొండ రాంబాబు నాయకత్వం నచ్చి ఈ సంఘంలో చేరామని, ఈరోజు నుంచి రజక వృత్తిదారుల జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు ఆధ్వర్యంలో పనిచేస్తామని రజక కుటుంబాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకులపై ఎవరైనా ఎటువంటి దాడులు చేసిన, దూషణలు, దౌర్జన్యాలు, అగ్ర కులాల పెత్తందారులు దాడులు చేసిన, కుల వివక్షతతో ఇబ్బందులు పెట్టిన చూస్తూ ఊరుకునేది లేదని, కుల దూషణలు ఎక్కువ అయ్యాయని, మా రజకుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇందిరమ్మ ఇండ్ల పథకం, మత్స్య కార సొసైటీలో, రాజీవ్ యువ శక్తి పథకంలో రజకులకు ప్రత్యేక కోటా కేటాయించాలని, కామారెడ్డి డిక్లరేషన్లో వ్యక్తిగతంగా 10 లక్షలు, సొసైటీకి 30 లక్షలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని రజకులపై అగ్రకుల పెత్తందారుల దాడులు,దౌర్జన్యాలు, వ్యక్తిగత కుల దూషణలు, ఎక్కువయ్యాయని వాటిని అరికట్టాలంటే రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని,

50 సంవత్సరాల నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలని, జిల్లాలో ఇప్పటికే శాంక్షన్ అయిన ధోబి గార్డెన్ వెంటనే నిర్మాణం చేపట్టాలని, ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో ఒక ధోబి గార్డ్ నిర్మాణానికి స్థలం కేటాయించి రజకులను ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరినాథ్ బాబు, ప్రభ, తాటికొండ రాజు, ప్రశాంత్, నవీన్, నగేష్, ఐతంరాజు రాజు, వెంకటేశ్వర్లు, మధు, కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News