ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు..
తూప్రాన్ మే,28 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయం కి వెళ్ళే ప్రధాన మార్గం మొత్తం గుంతలమయం కావడంతో వర్షానికి వచ్చిన నీరు అందులో చేరి చుట్టూ ప్రక్కల శ్రీనివాస్ నగర్,విద్య నగర్,డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్ళే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.బారీగా రోడ్డు గుంతల మయం కావడంతో అందులో వర్షపు నీరు చేరుకుని రాకపోకలకు తీవ్ర ఆటకం కలుగుతుందని కాలనీ వసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యంగా ఆర్డీవో కార్యాలయంలో పనుల కోసం వెళ్ళే ప్రజలకు కూడా ఇది పెద్ద సమస్యగా మారిందని పలువురు వాపోతున్నారు.
Post Views: 293









