బూర్గంపాడు
బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ ఉపాధి కార్మికులు ఉప్పుసాక గ్రామాన్ని దాటి టేకుల చెరువు చెలల్లో పోయే రోడ్డుని పనిచేస్తున్న,ఉపాధి కార్మికుల్ని సందర్శించిన వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం బిజెపి ప్రభుత్వం ఉపాధి కార్మికులకి కనీసం వేతనం 307 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులు చెప్పారు కానీ ఉపాధి కార్మికులకు రోజు కూలి 100 నుండి 150 మట్టికి, పడుతున్నాయని పినపాక పట్టి నగర్ ఉపాధి కార్మికులకు ఆటో చార్జీ 60 రూపాయలు పోతే మిగిలేది 40 నుండి 90 వరకు కూలి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని అధికారులను కోరేది ఏందంటే పెరుగుతున్న నిత్యవసర సరుకులకి అనుకూలంగా ప్రభుత్వం నిర్మించిన రేటు అన్న ఉపాధి కార్మికులకు ఇవ్వాలని డిమాండ్.
అంతేకాకుండా మే 20న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఉపాధి పనిని కాపాడుకోవాలని ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్ల్ గా మార్చి కార్మికుల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నా మోడీ ప్రభుత్వం,అందుకే దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలని కార్మిక చట్టాలని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఇంకా ఉధృతంగా కార్మికులు వీధుల్లోకి భార్య పిల్లలతో వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం,ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు, కొట్టే ప్రభాకర్, బప్పని రవి, కుర్స తిరుపతయ్య,ఊలోజూ సుమలత, తలారి మంజుల, తలారి రాణి, మసరకట్ల రాణి, తదితరులు పాల్గొన్నారు









