హుజూర్ నగర్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలోని నల్ల చెరువుకు గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టడం వల్ల చెరువు ఖాళీ అయి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గి బావులు,బోర్లు వట్టిపోయి ఎండల దృష్ట్యా నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని చెరువులో నీటిని అక్రమంగా తోడేస్తున్న విషయమై నీటి పారుదల శాఖ డీఈకి తెలియజేయగా సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి గండిని పూడ్చినట్లు తెలిపారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రజల నీటి అవసరాల దృష్ట్యా చెరువులలో నీరు నిల్వ చేయడం జరిగిందని ఎవరైనా ఉద్దేశపూరితంగా చెరువులకు గండ్లు పెట్టినచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 63









