తూప్రాన్,మార్చ్ 25, వై సెవెన్ న్యూస్
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి పోతురాజు పల్లి శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ కు చెందిన 2011 2012 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు తూప్రాన్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల (అపూర్వ) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు పాఠశాల లో వారికీ విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు భూషణం చారి, శ్రీనివాస్, రాంప్రసాద్, సాగర్, రాజు ల కు, పూలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు విద్యార్థులందరూ ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ స్కూల్ డేస్ లో వాళ్లు చేసే చిలిపి పనులను తలచుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు చదువు చెప్పిన గురువులను మర్చిపోకుండా ఈరీతిని సత్కరించిన విద్యార్థులు అందర్నీ తెలుగు పండిట్ రాంప్రసాద్ ఆశీర్వచనాలు అందించారు చదువు నేర్పిన గురువులను చదివిన స్కూలుని ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా అభినందినీయమని, భూషణం చారి తెలిపారు , చదువు నేర్పిన గురువులను ఈ విధంగా సత్కరించడం విద్యార్థుల సంస్కారానికి నిదర్శనమని టీచర్ శ్రీనివాస్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన విద్యార్థులకు రాజు సాగర్లు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుస్మిత మౌనిక ఈ అనూష నవీన్ నరేష్ చరణ్ దస్తగిరి ,ఆబేద్, ప్రసాద్, ఆంజనేయులు, రుషి మాల, శిల్పా, ముజాహిద్ మరియు విద్యార్థులందరూ పాల్గొన్నారు









