కొత్తగూడెం ఫిబ్రవరి 28 వై7 న్యూస్;
కొత్తగూడెం టౌన్ కూలీ లైన్ హైస్కూల్లో హెడ్మాస్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ దాడుల్లో హెడ్ మాస్టర్ రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. కరాటే శిక్షణకు పాఠశాలకు రూ.30 వేలు మంజూరు అయితే దానిలో ఇన్స్ట్రక్చర్కు ఇవ్వాల్సిన రూ.30 వేలల్లో రూ.20 వేలు HM లంచం డిమాండ్ చేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
Post Views: 789