సేవలను గుర్తిస్తూ స.హ. జిల్లా అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధిష్టానం
అనకాపల్లి , ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;
సమాచార హక్కు చట్టంపై తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడు, కార్మికుడు నిస్వార్థంగా,
నిజాయితీగా, కమిట్మెంట్ తో,ప్రజా అభ్యుదయమే ప్రధాన ఆశయంగా చేసిన కృషికి గుర్తింపుగా ప్రజా సంకల్ప వేదిక సమాచార హక్కు చట్టం అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా సామాజిక కార్యకర్త
బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)ను ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షులు ఎం.రంగసాయి రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మునగపాక మండలం గవర్లఅనకాపల్లి గ్రామానికి చెందిన బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్) సమాచార హక్కు చట్టంపై, వినియోగదారుల హక్కు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఆద్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, ఉచితంగా విద్యార్థిని, విద్యార్థులకు చెస్ నేర్పించడం మొదలగు అనేక కార్యక్రమాలలో పాల్గొంటు తనదైన శైలిలో నిస్వార్థంగా సేవలు చేస్తున్నారు.
సమాచార హక్కు చట్టంపై బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)
చట్టం వచ్చిన 2005 అక్టోబర్ 12 నుండి అవిశ్రాంతంగా సేవలు చేస్తూ విశేష కృషికి గుర్తింపుగా ఈ నియామకం చేపట్టారు.
స.హ. చట్టంపై స్కూల్స్ లోనూ, కాలేజీలోనూ,
యూనివర్సిటీలలోనూ,ట్రైన్ లలోనూ, బస్సులలోనూ, అన్ని రాజకీయ పార్టీల సమావేశాలలో,వారపు సంతలలోనూ,పలు సంస్థల సమావేశాలలోనూ కరపత్రాల ద్వారా ప్రచారం అవగాహన కల్పించడం,వివరించడం, చైతన్యం, ప్రజలకు, విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై సదస్సులు ఏర్పాటు చేయడం అవగాహన చైతన్యం తీసుకువచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లో విశేష కృషి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేసే విదంగా తన శాయశక్తులా కృషి చేశారు.
సమాచార హక్కు చట్టంపై అన్ని వర్గాల వర్గాల ప్రజానీకానికి ఆమోదయోగ్యంగా ఉండే పుస్తకాలకు (బుక్స్ ను) తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో అనేక మండలాలో , గ్రామాలలో అతి తక్కువ రేటుకు అందించడం,పంపిణీ చేయడం ఒక శ్రామికుడు తెలుగు రాష్ట్రాలలో కమిట్మెంట్ తో ఈ చట్టంపై సేవాకార్యక్రమాలు చేపట్టిన విధానం,తన ఆలోచన నిస్వార్థ సేవా నిరతికి నిదర్శనంగా చెప్పవచ్చు.తన నియామకం పై ప్రజా సంకల్ప వేదిక ప్రతినిధులు, పలువురు ప్రముఖులు జగ్గ అప్పారావు ను అభినందించారు.