E-PAPER

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏవో కు పెరుగుతున్న మద్దతు

రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే నిస్వార్థపరుడు ఏ.వో….

ఏవో కి ఫెర్టిలైజర్ షాపుల యజమానుల మద్దతు

అశ్వాపురం ఫిబ్రవరి 24 వై 7 న్యూస్

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అశ్వాపురం వ్యవసాయాధికారి సాయి శాంతన్ కుమార్ కు అశ్వాపురం మండలం ఫెర్టిలైజర్ స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులో యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. సోమవారం మొండికుంటలో విలేకరులతో మాట్లాడుతూ… వ్యవసాయ అధికారి నిజాయితీపరుడన్నారు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించే వారని, ఎరువులు పురుగు మందుల షాపులను నిత్యం పర్యవేక్షిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వారన్నారు. ఒక నీతి నిజాయితీ గల అధికారిని కొంతమంది తమ స్వలాభాపేక్ష కోసం వ్యవసాయ అధికారిని కావాలని ఏసీబీ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎరువుల షాపు యజమానులే కావాలని వ్యవసాయ అధికారిని ఏసీబీకి పట్టించారని వస్తున్న వదంతుల్లో ఏ మాత్రం నిజం లేదని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎరువులు పురుగుమందుల షాపుల అశ్వాపురం మండల అసోసియేషన్ పేర్కొంది. ఈ సమావేశంలో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యజమానులు నూకారపు బిక్షమయ్య సోమ వెంకటరెడ్డి,సోమ శ్రీధర్ రెడ్డి,సురేందర్ రెడ్డి కోటిరెడ్డి,చెలమల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్