E-PAPER

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది

రాయల నాగేశ్వరరావు
రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 01 వై 7 న్యూస్;
కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు..కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎పై స్పందించారు..ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందన్నారు..ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు..బీహార్,ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణనికి వేల కోట్లు ఇస్తామంటున్న కేంద్రప్రభుత్వం.. తమ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు.కేంద్రంతో ఫ్రెండ్లి‎గా ఉండటం తమ చేతగాని తనం కాదన్నారు..వివక్ష లేకుండా తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు కేటాయించాలన్నారు..కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టు కనిపిస్తోందన్నారు. మొదటి నుండే ప్రధాని తెలంగాణ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు..ఆంధ్రాకు మాత్రం అన్ని విధాలుగా నిధులు ఇచ్చారని తెలిపారు. అయితే దానికి తాము ఎలాంటి విమర్శలు చేయడంలేదన్నారు. అదే సందర్భంగా పునర్విభజన చట్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు..మద్దతు ఇచ్చే పార్టీలతో లాలూచీ పడిన బడ్జెట్ ఇది అని విమర్శించారు.తెలంగాణకు నిధులు కేటాయింపులో పూర్తిగా విఫలం అయినందుకు కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రానికి నిధులు తేనప్పుడు 8మంది బీజేపీ ఎంపీలు ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. బడ్జెట్‎ను మరోసారి సవరించి తెలంగాణకు నిధులు విడుదల చేయాలన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్