మణుగూరు,డిసెంబర్17 వై 7 న్యూస్;
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశానుసారం మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని విద్యానగర్ కాలనీలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని రానున్న పంచాయితీ ఎన్నికల్లో మల్లి కాంగ్రెస్ జెండాను ఎగరవేసే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసి అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రభుత్వ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లును పేదలకు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో విద్యానగర్ నాయకులు ఊకే కృష్ణవేణి,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గాండ్ల సురేష్ , సుబ్బారెడ్డి, రాంమూర్తి, ముసలి శ్రీను, గణేష్ రెడ్డి, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.