E-PAPER

తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా సెక్రటరీగా ఏర్ల విజయలక్ష్మి

బాన్సువాడ డిసెంబర్ 17 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడకు చెందిన ఏర్ల విజయలక్ష్మి తెలంగాణ పద్మశాలి మహిళా సంఘం సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బాన్సువాడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలిగా గత రెండు సంవత్సరాలుగా పద్మశాలి సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పద్మశాలి సంఘానికి సేవలు చేస్తున్న ఏర్ల విజయలక్ష్మికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా, రాష్ట్ర మహిళా సంఘం విభాగానికి సెక్రెటరీగా ఎన్నుకోవడం జరిగింది. మంగళవారం హైదరాబాద్ హరిహర కళాభవన్ లో తెలంగాణ పద్మశాలి సంఘం ఏర్పాటుచేసిన ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పద్మశాలి సంఘం తరఫున ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్