వీటిని మాయం చేసిన ఘనుడు ఎవరు?
మాయం చేయాల్సిన అవసరం ఏమిటి ?
బిచ్కుంద కీలక కూడలి వద్ద సిసి కెమెరాలు మాయం
బిచ్కుంద డిసెంబర్ 11 వై సెవెన్ న్యూస్ తెలుగు
ఎంతటి సంఘటనైన శోధించడానికి కీలకం సీసీ కెమెరాలు .100 మంది పోలీసులతో సమానంగా ఒక్క సీసీ కెమెరా పనిచేస్తుంది. హత్యలు, దొంగతనాలు, లైంగిక వేధింపులు, అక్రమంగా ఇసుక తరలింపు, డ్రగ్స్ రవాణా లాంటి కీలకమైన ఘటనలను సీసీ కెమెరాలు దర్యాప్తులో ఎంతో కీలకంగా పనిచేస్తుంటాయి. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత సీసీ కెమెరాల పై దృష్టిని పెట్టారు. వ్యాపారస్తులకు తమ వ్యాపార సంస్థల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ముఖ్యమైన కూడలిల వద్ద సీసీ కెమెరా ఏర్పాటుకు పోలీస్ శాఖ ముందుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ శ్వేత ఆదేశం మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో ముఖ్యమైన కూడలిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా వల్ల కామారెడ్డి జిల్లాలో , నేరాలు ఘోరాలు అరికట్టగలిగారు. ముఖ్యంగా జూకల్ నియోజకవర్గంలో ప్రధాన పట్టణమైన బిచ్కుంద ఎంతో కీలకమైంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ బిచ్కుంద పట్టణం ఉంది. ఇక్కడినుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు కొనసాగుతుంటాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి బిచ్కుంద మీదుగా నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు డ్రగ్స్, పిడిఎఫ్ బియ్యం, గంజాయి, గుట్కా, మట్కా, దేశి దారి లాంటి మత్తు పదార్థాలు సరఫరా అవుతుంటాయి. ఇలాంటి కీలకమైన బిచ్కుంద ప్రాంతంలోని కాశీ విశ్వనాథుని ఆలయనికి వెళ్లే మార్గం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలు ఏడాదికితం మాయమైపోయాయి. ఈ
కూడలి వద్ద కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుర్తుపట్టే విధంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే మంజీరా నదిలో ఇసుక మాఫియా ప్రారంభం కావడంతో ఒకేసారి నాలుగు సీసీ కెమెరాలు మాయమైపోయాయి వాటిని పోలీస్ శాఖ తీసివేసిందా లేక ఎవరైనా సీసీ కెమెరాలు దొంగలించారా అన్నదాన్ని ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. పోలీస్ శాఖ సైతం కాశీ విశ్వనాథుని ఆలయం మార్గానికి వెళ్లే ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలు మాయమైపోయి ఏడాది అయిన వాటి గురించి పట్టించుకోవడం నిందితులకు కలిసొచ్చే కాలం మైది అంతేకాకుండా అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దందా ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్ర కర్ణాటక తరలిపోతుంది. ఈ సీసీ ఫుటేజ్ చూడడానికి వీలు లేకుండా సీసీ కెమెరాలు మాయం కావడంతో ఇసుక మాఫియాకు పంట పండుతుంది ఇప్పటికైనా బిచ్కుందను భవిష్యత్తులో ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండాలంటే సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సి అవసరం పోలీస్ శాఖ పై ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.









