E-PAPER

వాహనాలకు తప్పకుండా ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి ;ఎస్ఐ రాజ్ కుమార్

పినపాక,డిసెంబర్10 వై 7 న్యూస్ తెలుగు

వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ చేయించాలని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. మంగళవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ వాహనాల తనిఖీ సమయంలో ప్రతి వాహనదారుడు తమ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల సరియైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, అత్యధిక వేగంతో వాహనాలు నడపరాదని, త్రిబుల్ రైడింగ్ చేయకూడదని ఆయన తెలిపారు. వాహనదారులు ఇట్టి చర్యలను ఉల్లంఘించిన చట్టపరంగా చర్యలు తీసుకోబడునని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆటో యూనియన్ నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, టీఎస్పీఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :