E-PAPER

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమవ్వాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య

అశ్వాపురం, డిసెంబర్06 వై 7 న్యూస్;
భార‌త రాజ్యాంగ రూప‌కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌నీయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అధ్య‌క్షులు, ఓరుగంటి బిక్షమయ్య కొనియాడారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అశ్వాపురం మండల కేంద్రంలోని కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, సామాజిక విప్ల‌వ దార్శ‌నికుడు, భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆయన జీవితం అంద‌రికీ ఆదర్శనీయమ‌ని ఓరుగంటి బిక్షమయ్య అన్నారు. రాజ్యాంగానికి బాటలు వేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడలోనే ప్రతి ఒక్కరు నడవాలని ఆయన ఆచరించిన రాజ్యాంగానే మనం నేటికీ అనుసరిస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఆయన జీవితమే సాధనగా ప్రతి ఒక్కరం మల్చుకుందామని ఓరుగంటి బిక్షమయ్య కోరారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి,ఓరుగంటి రమేష్ బాబు,మాజీ సర్పంచ్ బట్ట సత్యనారాయణ,కందాల వెంకటరెడ్డి,శ్యామల కృష్ణారెడ్డి, లోడిగ నరసింహారావు,కంబాలపల్లి లింగయ్య,మట్టా వీరభద్రారెడ్డి,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే మోసిన్,కుంజర్ జాన్,కలేటి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్