అగ్రవర్ణాల ఆక్రందనలు అరికట్టి దళితులకి దిశ నిర్దేశికమై ప్రపంచానికే మార్గదర్శకమై రాజ్యాంగ నిర్మాతగా వెలుగొందిన ధీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్
తిరుమలాయపాలెం డిసెంబర్ 6 (వై 7 న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో తోపాటు కొక్కిరేణి పిండిప్రోలు సుబ్లేడు దమ్మాయిగూడెం పాతర్లపాడు జల్లేపల్లి కాకరవాయి జూపెడ బీరోలు ఏలు వారి గూడెం రాజారం మేడిదపల్లి ఆయా గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సందర్భంగా మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ మాట్లాడుతూ అణగారిన ని మ్న జాతులలో నిమ్నత్వాన్ని పారదోలుటకై తాడిత పీడిత హక్కుల కై పోరాడిన జ్ఞాన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల హక్కులను కల్పించాలని బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేడు స్వేచ్ఛ వాయువుని పిలుచుకున్నారంటే దానికి కారణం అంబేద్కర్ అని అన్నారు భౌతికంగా అంబేద్కర్ మన నుండి దూరమైనా కానీ ఆయన రాసిన రాజ్యాంగంలో నేటికి బ్రతికే ఉన్నారని పేర్కొన్నారు నేటి యువత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మి జయపాల్ మందడి ఇజ్రాయిల్ సీనియర్ జర్నలిస్ట్ పప్పుల శ్రీనివాసరావు కూరపాటి విజయ్ కుమార్ సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను బొబ్బిలి భరత్ చంద్ర పూజా వెంకటరత్నం ఉండేటి ధర్మరాజు దోమల రమేష్ పదం ముత్తు కనకరాజు నూక తోటి సాల్మన్ కొప్పుల రాజేష్ కొప్పుల దిలీప్ నెర్సుల లూకా ఆలేటి రాములు చింతకాయల యశ్వంత్ ఉండేటి రవి ఆలేటి రంగయ్య ఏగూరి దాసు ఉండేటి ప్రకాష్ ఉబ్బాని ప్రసన్న ఏగూరి సలీం తదితరులు పాల్గొన్నారు