E-PAPER

డిసెంబర్ 1న హైదరాబాదు లో జరిగే మాల సింహగర్జన సభను జయప్రదం చేయండి

మాలల సింహ గర్జన కరపత్రాలు పోస్టర్ ఆవిష్కరణ

తిరుమలాయపాలెం నవంబర్ 22 వై 7 న్యూస్

డిసెంబరు 1 వ తేదీన హైదరాబాదులో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాల మాల ఉపకులాల బహిరంగ సభను జయప్రదం చేయాలని శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు పప్పుల ప్రసాద్ అధ్యక్షతన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా కార్యదర్శి పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మడి కనకరాజు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు ను వ్యతిరేకించాలని కోరారు. డిసెంబర్1న జరిగే మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్క మాల వేలాదిగా తరలిరావాలనిఅన్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ రేపు జరగబోవు సభ ప్రాంగణం లో మాలలు సింహలై గర్జించిసవాగా ఉండాలని కోరుకుంన్నారు. మెట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేపు డిశంబర్ నెలలో జరిగే మాలల సింహగర్జన మీటింగ్ లో ప్రతి ఒక్క మాల కుటుంబ సభ్యులు అందరు కలిసి మాట్లాడుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు మెట్టు వెంకటేశ్వర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు పప్పుల ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి కాశిమల్ల మహేందర్ నూక తొట్టి సాల్మన్ పప్పుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News