E-PAPER

ప్రభుత్వ భూమి అమ్మింది అగ్రవర్ణాల పెద్దలే

పూర్తి సహకారం అందించిన ప్రముఖ రాజకీయ నేత

కబ్జా జరిగిన మౌనం పాటించిన గత రెవిన్యూ అధికారులు

గ్రామ పంచాయతీ మూసుగులో పైసలు కాళీ చేసిన ఘనుడు

పత్రిక కథనాలతో ఉలిక్కిపడ్డ గిరిజనేత్రులు

హద్దులు ఏర్పాటు చేసే పనిలో తాసిల్దార్ రాఘవరెడ్డి

ఒత్తిడి చేసే ఆలోచనలో రాజకీయ పెద్దలు!

అయ్యా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ భూమి జర కాపాడండి సారు

వై సెవెన్ న్యూస్ మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకీ ప్రభుత్వ భూములు కనుమరుగు అవుతున్నాయి. అగ్ర వర్ణాల దోపిడీ దారుల ధన దాహనికి ఖరీదైన ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయి ప్రభుత్వ భూమి ఉంది అంటూ తెలిసిన వెంటనే అగ్రవర్ణ బడాబాబులు గద్దల్లా వాలిపోతున్నారు.పక్క కార్యచరణ రూపొందించి గుట్టు చప్పుడు కాకుండా నివాస గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో ఖరీదైన ప్రభుత్వ భూములు రోజు రోజుకి కబ్జాలు జరుగుతున్నాయి. అయితే కబ్జాలు చేసే బడా బాబులకు స్థానిక రాజకీయ పెద్దలే సహకరించి కబ్జాలు చేయడం మండలంలో సంచలనం సృష్టిస్తుంది దాంతో స్థానికంగా పనిచేసే రెవెన్యూ అధికారులు మీ వద్దకు రాలేరు లే మేము ఉన్నాము అంటూ కొనుగోలుదారులకు హామీలు కల్పిస్తూ చట్టబద్ధంగా పనిచేసే రెవిన్యూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చెయ్యాలి అంటే అధికార పార్టీ పెద్దలకు భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికార అహంకారంతో బదిలీలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు కాపాడాలి అంటే ఆలోచన చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటూ విశ్లేషకులు తెలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ శివారు ప్రాంతం నుండి చిక్కుడు గుంట గ్రామం వరకు 853 సర్వే నెంబర్ విస్తీర్ణత ఉందనే విషయం అందరికీ తెలిసినదే అయిన, ఆ విస్తీర్ణంలో గ్రామాలకు కేటాయించిన భూములు ఉన్నాయి గిరిజనులకు కొంతవరకు పట్టాలు కలిగి ఉన్నాయి గిరిజనేత్రులకు సాగు కోసం కేటాయించిన భూములు ఉన్నాయి అదేవిధంగా అక్కడక్కడ ప్రభుత్వ భూములు అనేకంగా ఉన్నాయి దాంతో ఓ రాజకీయ ప్రముఖుడు గత ఇరువై సంవత్సరాలుగా బడా బాబులతో చేతులు కలిపి ప్రభుత్వ భూములు కనుమరుగు చేస్తున్నారు అనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ భూమిని చూపించి పంచాయతీ నిధులు ఖాళీ చేశారు అనే ఆరోపణలు నేటికీ వినిపిస్తున్నాయి. దాంతో రామానుజరం గ్రామంలో గతంలో రెవెన్యూ అధికారులకు గుర్తించిన ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రి చీకటి మాటున నివాస గృహాలు ఏర్పాటు చేసిన ఘటనలు ఉన్నాయి నివాస గృహాల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంబంధిత అధికారులు స్పందించడం లేదు అంటూ మండల ప్రజలు మండిపడుతున్నారు. అయితే ప్రధాన రహదారి పక్కన ఉన్న 30 ఎకరాల కబ్జాకు ముందే డిగ్రీ కాలేజీ కి కేటాయించిన 8 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిని ఓ అగ్రవర్ణ బడా బాబు సహాయంతో అమ్మకాలు జరిపినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇసుక క్వారీలు గత రోజుల్లో ఉండడం వలన గ్రామానికి ఇచ్చిన డబ్బులు మింగిన నేత ప్రభుత్వ భూమిని చూపించి పైసలు ఖాళీ చేశారు అంటూ గ్రామంలో చర్చలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ భూమికి గ్రామపంచాయతీ పైకం ఖర్చు చేసినట్లు ఎలా చూపించారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం అది డిగ్రీ కాలేజీకి కేటాయించిన ప్రభుత్వ భూమి కావడంతో గ్రామస్తులు గ్రామానికి కేటాయించిన భూమి ఎక్కడ కొనుగోలు చేశారు అంటూ ఆందోళన చెందుతున్నారు మరో పక్క డిగ్రీ కాలేజీ కేటాయించిన ప్రభుత్వ భూమి కబ్జా కావడంతో కాపాడే పనిలో మండల తహసిల్దార్ రాఘవరెడ్డి ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే రాఘవరెడ్డి పై ఒత్తిడి తేవడానికి ప్రముఖ రాజకీయ నేత అధికార పార్టీ నేతలతో ఒత్తిడి చేసే అవకాశం ఉందని మేధావులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం కలెక్టర్ స్పందిస్తేనే జరుగుతుందంటూ విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి ఇప్పటికైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ విద్యా శాఖకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేయాలి అంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు పూర్తి వివరాలు మరో కథనంలో…..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :