E-PAPER

మణుగూరు ఏరియా సింగరేణి హాస్పిటల్ లో ప్రసూతి వైద్య నిపుణురాలిని నియమించాలి

సామాజిక సేవకులు కర్నే బాబురావు

మణుగూరు, నవంబర్ 12 వై 7న్యూస్

మణుగూరు ఏరియా సింగరేణి హాస్పిటల్ లో ప్రసూతి వైద్య నిపుణురాలిని వెంటనే నియమించాలని కోరుతూ మంగళవారం నాడు
కొత్తగూడెంలో సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ)పి. సుజాత కి వినతి పత్రం అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా హాస్పిటల్లో ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ లో కొత్తగూడెం తరలించాలంటే ఎంతటి ఇబ్బందో పేషెంట్ కి కూడా ఎంతటి ఇబ్బందో ఒక మహిళగా తమరికి తెలియంది కాదన్నారు. సింగరేణిలో నూతన నియామకాల నేపథ్యంలో అనేకమంది యువతి, యువకులు ఉద్యోగులుగా రావటం ప్రసూతి వైద్య నిపుణురాలి అవసరం కూడా ఎంతైనా ఉందన్నారు.దయచేసి వెంటనే మణుగూరులో ప్రసూతి వైద్య నిపుణురాలిని (గైనిక్) నియామక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను, అదేవిధంగా చలికాలం గుండెకు సంబంధించి వ్యాధులు తమ ప్రతాపం చూపించే సమయం గత అనుభవాలు కూడా దయచేసి కార్మికుల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ముందస్తు వ్యాధి నిర్ధారణ చర్యలు కూడా చేపట్టాలని కోరినట్లు ఆయన తెలిపారు మేడం సానుకూలంగా స్పందించారని బుధవారం నుండి మణుగూరులో ప్రసూతి వైద్య నిపుణురాలు అందుబాటులో ఉంటుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజాత హామీ ఇచ్చినట్లు ఆయన విలేకరులకు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :