ఏ జీ హెఛ్ స్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల కు వినతి పత్రం అందజేత
పినపాక,అక్టోబర్21 వై 7 న్యూస్;
పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ మద్ధులగూడెం గ్రామం లో రామంజనేయపురం జీపీయస్ పాఠశాల లో సుమారు 74 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ వారికి విద్య బోదించే ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే వున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల సర్దు బాటులో ఉపాధ్యాయులను నియమించినా వారు కొన్ని కారణాల వాళ్ళ పాఠశాల కు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థుల తల్లితండ్రులు మా పిల్లలకు అన్యాయం జరుగుతున్నది అని గుర్తించి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయు లను నియమించడానికి ప్రయత్నం చేస్తామని ఏ జీ హెచ్ స్ కాంప్లెక్స్ ప్రధానోపధ్యాయులు హామీ ఇచ్చారు
Post Views: 339









