E-PAPER

మరుగుదొడ్లు లేక మహిళలు పడుతున్న అవస్థల పైన యాజమాన్యాలు దృష్టి సారించాలి

ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.

మణుగూరు,అక్టోబర్ 21 వై 7 న్యూస్

సింగరేణి కార్మికులు,ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు మణుగూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు అర్ టి సి బస్ ఎక్కి,దిగె ముఖ్యమైన స్టేజి లలో టాయిలెట్స్ నిర్మాణం లేకపోవడం వల్ల మహిళామణులు అనేక అవస్ధలు,ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి తెలియచేశారు..పీవీ కాలనీ, సి టైప్ ,పద్మగూడెం కాలనీ పరిసరాలలో నివాసం ఉండే వారు ఎక్కువగా బస్ ప్రయాణ రాకపోకల కోసం పట్టణ ప్రారంభంలో ఉన్న అంజనేయ స్వామి ఆలయ దగ్గర ఉన్న ఆర్ టి సి స్టేజి నీ ఉపయోగిస్తారు.బొంబాయి కాలనీ ఏరియా వైపు నివాసం ఉండే పరిసర ప్రాంతాల వారు అంబేడ్కర్ సెంటర్ దగ్గర ఉన్న బస్ షెల్టర్ స్టేజి ని ఉపయోగిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు…ఈ రెండు ప్రధాన స్టేజీలలో నిత్యం సింగరేణియులు వందలాది మంది ప్రయాణాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలలో మరుగుదోడ్ల నిర్మాణం లేకపోవడం మూలంగా మహిళ ప్రయాణికులు అనేక ఇబ్బందులు,బాధలు ఎదుర్కొంటున్నారని తెలిపారు పి వి కాలనీ ఏరియా వైపుకు వెళ్ళే ప్రయాణికులు అంజనేయ స్వామి గుడి స్టేజి దగ్గర, దిగకుండా మల, మూత్ర విసర్జనల కోసం ఊరికి చివరిగా ఉన్న సురక్ష బస్టాండ్ వరకు ప్రయాణం చేసిన దాఖలాలు లేకపోలేదని తెలిపారు.దానివల్ల సమయం వృదా, ఆర్థికంగా నష్టం అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు కార్మిక సంక్షేమం, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల శ్రేయస్సును సింగరేణి ఆర్ టి సి యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకుని సోషల్ రెస్పాన్స్ కింద అంజనేయ స్వామి ఆలయం దగ్గర,అంబేద్కర్ సెంటర్ దగ్గర స్త్రీ, పురుషులకు వేరు వేరుగా మరుగుదోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా తెలియచేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News