E-PAPER

కొత్తగా వచ్చిన ట్రైనింగ్ ఆపరేటర్ లను కలసిన టి బి జి కె యస్ నాయకులు

రామగుండం,అక్టోబర్16 వై 7 న్యూస్

రామగుండం ఏరియా టీ. టి సి నందు శిక్షణ పూర్తి చేసుకొని మణుగూరు ఏరియా కు ట్రైనింగ్ కోసం వచ్చిన 144 బ్యాచ్ 35 మంది అపరెటర్ లను ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి స్థానిక జి యం కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వానం అందించి శుభాకాంక్షలు తెలిపారు.. విధులు నిర్వహిస్తున్న సమయంలో రక్షణ నిబంధనలు పాటించి ప్రమాద రహిత సింగరేణి గా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.మంచి వాతావరణం, ఉమ్మడి కుటుంబాన్ని తలపించే కవాతావరణం కలిగిన మణుగూరు ఏరియా కు రావడం సంతోషకరమైన అంశం అని తెలిపారు.. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరారు .ద్విచక్ర వాహనాల పై విధులకు హాజరయ్యే సమయంలో తప్పనిసరి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కారు నడుపుతున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని వేగా నియంత్రణ పాటించాలని సూచించారు..అధికారులు చెప్పిన ప్రణాళికలను తూచ తప్పకుండా పాటిస్తూ అంకితభావంతో పని చెసి వివాదాలు లేకుండా సమన్వయంతో పని చేసుకోవాలని తెలిపారు.. కార్మిక సంక్షేమం, న్యాయమైన హక్కుల సాధన సంస్ధ ప్రగతి కోసం కష్టించి పని చేసే కార్మిక వర్గానికీ మణుగూరు ఏరియా టి బి జి కె యస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.. ఏరియా నందు మోసపూరిత సంఘాలు ఉన్నాయనీ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ముకేశ్, బంగారి పవన్ కుమార్, ఇమ్రాన్, రాజేష్ మరియు ఆపరేటర్ లు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News