E-PAPER

కార్మిక సంఘాల ముసుగులో విధులకు మంగళం పాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఇతర కార్మికుల పై పని భారం పెంచుతూ సంస్థకు నష్టం చేకూర్చే వారి పై యాజమాన్యం దృష్టి సారించాలి

ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి

మణుగూరు,అక్టోబర్14 వై 7 న్యూస్;

కార్మిక సంఘాల ముసుగులో ఉండి సంస్థకు నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడుతున్న వారిపై యాజమాన్యం దృష్టి సారించాలని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి తెలియచేశారు.ఏరియా నందు కొంత మంది అధికారులు అండదండలు నిండైన దీవెనలు పుష్కలంగా ఉండడం మూలంగా కొంత మంది విధులు పూర్తిగా నిర్వహించకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నారని దానివల్ల వారి పని భారం ఇతర కార్మికుల పై పడుతుందని ఇదేమిటని అడిగితే ప్రశ్నించే వారి పై అధికారుల ద్వారా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.. షిఫ్ట్ చెంజ్ లు, మ్యూచువల్ లు మరింత ఎక్కువైనాయని దాని వల్ల కొంత మంది నాయకులకు,అధికారులకు కాసులు కురిపిస్తున్నాయని కంపెనీ చట్టాలను తుంగలో తొక్కి వారి వ్యక్తిగత ప్రయోజనాలను వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారని తెలిపారు.. మస్టర్ నమోదు కేంద్రలైన మ్యాన్ వే లలో ఆయా సంఘాలకు అనుకూలమైన వ్యక్తులను నియమించి కంపెనీని ఆర్థికంగా నష్ట పరుస్తున్నారని అయన ఆరోపించారు.. కార్మిక, సంస్ధ శ్రేయస్సు కోసం కీలకంగా పని చేయవలసిన కొంత మంది మైనింగ్ ,మెకానికల్ ,ఎలక్ట్రికల్ వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ లు వారి విధులకు మంగళం పాడుతున్నారని సంఘాల ద్వారా వచ్చిన పదవులను ఆడంభరంగా మలుచుకొని వారి వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేసుకుంటూ కార్మికులను, సంస్థను తీవ్రంగా నష్ట పరుస్తున్నారని రక్షణ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు..వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ విధులు వారానికి రెండు రోజులు చేసి చట్టబద్ధమైన పుస్తకంలో నమోదు చేయవలసి ఉండగా కొంత మంది వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ లు అధికారులను మచ్చిక చేసుకొని విధులు నిర్వర్థించకుండానే మధ్యలో ఇంటికి వెళ్ళి బౌండ్ పుస్తకంలో తనిఖీలు చేసినట్టుగా రాసుకుంటూ సంస్థకు ,కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని మరికొంత మంది వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ లు వారికి చెందిన కార్మిక సంఘాల నాయకుల ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా పే డే, పి హెచ్ డి లలో షిఫ్ట్ మార్పులు చేస్తూ కార్మికుల పై వేధింపులకు పాల్పడుతున్నారని ఇలాంటి సంఘటనల వల్ల సంస్థ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి సంస్ధ ప్రగతి, కార్మిక సంక్షేమం విఘాతం కలిగించే వారి పై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :