మణుగూరు,అక్టోబర్14 వై 7 న్యూస్;
మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటుచేసిన 6 కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నట్లు మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.యువతకు మరింత ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో అత్యధిక కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. మణుగూరు ఏటీసీ కేంద్రంలో ఏర్పాటుచేసిన కోర్సులలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్(1 సంవత్సరం), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్(1 సంవత్సరం), ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ (1 సంవత్సరం), బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ ( మెకానికల్) (2 సంవత్సరాలు ), అడ్వాన్స్డ్ CNC మిషనింగ్ టెక్నీషియన్(2 సంవత్సరాలు ), మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ (2 సంవత్సరాలు), కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. పదో తరగతి పూర్తి చేసుకున్న వారు. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు అన్నారు. ప్రవేశం పొందదలిచినవారు. http://iti.Telangana.gov.in లో ఆన్లైన్ చేసుకొని తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కి వచ్చి ప్రవేశం పొందగలరు. ఈ అవకాశాన్ని పినపాక నియోజకవర్గం లోని యువతి యువకులు సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలిపారు.