E-PAPER

పొంగులేటి శ్రీనన్న పర్యటన విజయవంతం చేయండి

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్

మణుగూరు,అక్టోబర్14 వై 7 న్యూస్;

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మణుగూరు మండలం లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని నవీన్ తెలిపారు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు ఆశ్రమ బాలికల హై స్కూల్ శంకుస్థాపన చేయనున్నారని, మధ్యాహ్నం 3:45 నిమిషాలకు పీవీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో పినపాక నియోజకవర్గం స్థాయి అధికారుల సమీక్ష సమావేశం లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపి పోరిక బలరాం నాయాక్ , అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య హాజరు అవుతున్నార ని తెలిపారు. కావున,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News