కొత్తగూడెం,అక్టోబర్14 వై 7 న్యూస్
కొత్తగూడెం పట్టణంలోని రైటర్ బస్తీ త్రిమాతా దేవాలయం, పాత కొత్తగూడెం అమ్మవారి దేవాలయంలో దసరా ఉత్సవాల సందర్బంగా ఆలయకమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అమ్మ వారిని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు అమ్మ దయతో అందరు బాగుండాలన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు కరీం పాషా, బొబ్బల వెంకట్ యాదవ్, మరియు ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 27