పినపాక నియోజకవర్గం లోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యుజే (టీజేఎఫ్) మణుగూరు సబ్ డివిజన్ అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ అన్నారు. ఎంతోమంది వర్కింగ్ జర్నలిస్టులు సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో నివసిస్తున్నారని, జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరడం లేదని అన్నారు. జీతభత్యాలు లేకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజంలో జరుగుతున్న మంచి, చెడులను వార్తల రూపంలో ప్రజలకు తెలియజేస్తూ జీవనం సాగిస్తున్న ఎంతోమంది జర్నలిస్టులకు తలదాచుకోవడానికి సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించి మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ విషయంపై స్పందించి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను అమలు చేయాలనికోరారు.
Post Views: 434