E-PAPER

బి ఆర్ ఎస్ నాయకుల పై మండిపడ్డ పీరినాకి నవీన్

ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకనే ఎమ్మెల్యే పాయం పై ఆరోపణలు చేయడం బి ఆర్ ఎస్ నాయకుల సిగ్గు మాలిన పని

అక్రమకేసులు పెట్టి వేదించడం మీకు అలవాటు

కబ్జాలు, నోటీసులు, సెటిల్మెంట్ లు కుదరక పొతే అక్రమ కేసులతో దోచుకుంది మీరు కాదా..!

మీ దౌర్జన్యానికి నిరాశ్రాయులు అయినవారు ఎంతమందో..!

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్

మణుగూరుఅక్టోబర్06 వై 7 న్యూస్;

మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గెలిచినా 10 నెలల కాలంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిత్యం ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అనునిత్యం ప్రజా సమస్యలపై తపన పడుతున్న ఎమ్మెల్యే కు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్చుకోలేక వాళ్ళ ఉనికి కోసం టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, వాళ్ళ బృందం పినపాక ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడం విడ్డూరంగా ఉంది.గత పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి నెలకు ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ భయభ్రాంతులకు గురిచేసి వాళ్ల చెప్పు చేతుల్లో పెట్టుకొని అరాచకాలు సృష్టించిన నైజం మీది.ఇది ప్రజలు గమనించే ఎంతో వేదన అనుభవించి మీకు తగిన బుద్ధి చెప్పారు అని అన్నారు.సౌమ్యుడు, మృదుస్వభావి, ప్రజా సేవకుడు, అయిన పాయం ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు.తప్పుడు ప్రచారాలు మానుకొని చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించండి మీరు పెట్టిన అక్రమ కేసులు కబ్జాలు మీ వల్ల బలైపోయినటువంటి కుటుంబా ల ఆధారాలతో సహా నిరూపిస్తాం దమ్ముంటే చర్చకు సిద్ధమా అని అన్నారు.రాష్టం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పినపాక లో పాయం నాయకత్వం లో అధికారులు స్వేచ్ఛగా నిజాయితి గ బాధ్యతగ పనిచేస్తున్నారని, మీ ఉనికి కోసం నిందలు వేయడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యే పాయం పైన నిరాదారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని, మిమ్ములను కాంగ్రెస్ కార్యకర్తలు నియోజకవర్గం లో తిరగనియకుండా ఆడ్డుకొని తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని హెచ్చరించ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :