రాజమండ్రి,అక్టోబర్ 06 వై 7 న్యూస్;
మన ఆంధ్రులకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కావాలా !
బాప్టిస్ట్ పవన్ కళ్యాణ్ కామెడీ కావాలా !
శ్రీ వారి లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవటం నిజమా! అబద్దామా !
పాలన చేతకాక దైవ మనోభావాలతో రాజకీయ విష కాలుష్యాన్ని ప్రోత్సహస్తున్నారు .
మేడా శ్రీనివాస్ , ఏద్దేవా ,రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
కాలం చెల్లిన నేటి పాలకులతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు అత్యంత ప్రమాదం పొంచి వుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు ..
పుట్టేడు కష్టాల్లో ఉన్నటువంటి నవ్యాంద్ర ప్రదేశ్ కు పాలనా అవినీతి , పెత్తందారి ఆధిపత్యం కారణంగా అభివృద్ధి శున్యంగా మారిందని , రాజకీయ ఆరోపణలు , ప్రత్యారోపణాల తోనే 10 ఏళ్లుగా కాలం వెళ్ళబుచుతున్నారని , వేల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేస్తున్నాయని కొన్ని కార్పొరేట్ మీడియా ల్లో ప్రధాన వార్తలుగా ప్రజలు చదుకోవటం తప్ప మారే అభివృద్ధి లేకపోయిందని , ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇతర రాష్ట్రాలకు తరలించుకు పోతున్నా మన పాలకులు శుద్ధ పప్పులు వలే చూస్తు పళ్ళు ఈకలిస్తుండటం విశేషం . రాష్ట్ర విభజన అనంతరం ఏ ఒక్క అభివృద్ధి లేకపోగా ఉపాధి మార్గాల కోసం ఆంధ్రులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని , మన పాలకుల అవినీతి దాహంకు పట్టభద్రులైన మన రాష్ట్ర యువత కూలి పనులకు పోతున్నారని, నవ్యాంద్రప్రదేశ్ భవిష్యత్ ను 29 గ్రామాల ఆధిపత్య రాజకీయాలకు దాసోహం చేసే విధంగా అమరావతిని రాజధానిగా ప్రకటించటం మూర్ఖపు చర్య కాదా అని , మొత్తం నిపుణుల కమిటీలు , చివరకు ప్రపంచ బ్యాంక్ సైతం అమరావతి రాజధానిగా వద్దు అని చెప్పినా మొండిగా అమరావతినే రాజధానిగా ముందుకు కోన సాగించే ప్రయత్నం చేయటం రాజ్యాంగ వ్యతిరేకమని , సాక్షాత్తు ప్రకృతే ఒక విపత్తుగా సాక్ష్యం ఇచ్చినా ప్రక్క రాష్ట్రాల రాజధానులను ఉదాహరణలుగా చెప్పుకుంటు పాలనా అబద్దాలతో రాజకీయ కాలక్షేపం చేసుకోవటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు .
ఆంధ్రప్రదేశ్ లో ప్రాణాలోడ్డి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ సర్కార్ ప్రైవేట్ , కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేసే కుట్రలు చేస్తున్నా మన పాలకులు చోధ్యం చూస్తున్నారని , మన ఆంధ్ర రాష్ట్ర సంపదను మన పాలకులు సాక్షిగా రాజమర్గం లో రాజకీయ దొంగలు దోచుకుపోతున్నారని , మన రాష్ట్రం వెలకట్టలేని మహా సంపద గల రాష్ట్రం అని, సహజ సిద్దమైన ప్రకృతి సంపద ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఆస్తి అని , ఒక ప్రక్క స్టీల్ ప్లాంట్ , మరో ప్రక్క రైల్వే డివిజన్ , కేజీ బేసిన్ లక్షల సంపద దోపిడీకి క్షుద్ర కుట్రలు జరుగుతున్నా ఆంధ్ర పాలకులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని , రాష్ట్ర భవిష్యత్ ఘోరాతి ఘోరంగా నష్ట పోతున్నా బాప్టిస్ట్ పవన్ కళ్యాణ్ కామెడీతో యువత దృష్టి మళ్లీస్తున్నారని , పొంతన లేని మాటలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కాలుష్యానికి కారకులవుతున్నారని , పచ్చి అబద్దాలను , రాజకీయ మోసాలను పవన్ కళ్యాణ్ అస్త్రంగా మార్చుకుని యువత బంగారు భవిష్యత్ కు శాపంగా మోకాలు అడ్డు పెడుతున్నారని , డైవర్షన్ రాజకీయాలతో పవన్ కళ్యాణ్ కామెడీ రాజకీయాలు చేస్తు విలువైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు అడ్డ దిడ్డంగా మారారని , ఎందుకో పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ పైన , ఆంధ్రుల పైన ఎనలేని కోపం, కక్ష వుందని , అందుకనే మాతృ రాష్ట్ర అభిమానం పవన్ కళ్యాణ్ లో ఎక్కడా కనపడదని , బాప్టిస్ట్ రాజకీయాలతో మత సామ రస్యానికి విఘాతం కల్గిస్తున్నారని , ఆంధ్రప్రదేశ్ లో ఒక పథకం ప్రకారం కుట్ర రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు.
శ్రీ వారి లడ్డు ప్రసాదం నెయ్యిలో సరైన నిర్దారణ లేకుండానే బాప్టిస్ట్ పవన్ కళ్యాణ్ లడ్డులో కల్తీ జరిగిందని , నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని ఒకసారి, మరో సారి ఆవు కొవ్వు కలిసిందని , సందర్భాన్ని బట్టి జంతు అవశేషాలు కలిసాయని పొంతన లేని రాజకీయ ఆరోపణలతో ప్రపంచంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తుల మనోభావాలను బాప్టిస్ట్ పవన్ కళ్యాణ్ గాయపరిచారని , నెయ్యి కల్తీ పై నేటికి నిజాన్ని నిగ్గు తేల్చలేదని , పైగా రాష్ట్రంలో మత కలహాలను ప్రేరేపించే విధంగా రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తున్నారని , శ్రీ వారి ప్రసాదంలో కల్తీ జరిగిందా ! లేదా అనే వాస్తవాన్ని తేల్చకపోతే బాప్టిస్ట్ పవన్ కళ్యాణ్ పై చట్ట పరమైన చర్యలు తప్పవని , మైనర్ బిడ్డ క్రిష్టియన్ అయినప్పుడు తండ్రి హిందువు అవుతాడా ! పవన్ కళ్యాణ్ తో టి టి డి ఆలయ ఈ వో మల్లికార్జున రావు నిబంధనల మేరకు డిక్లరేషన్ పై సంతకం తీసుకోకపోవటం బాధ్యతారాహిత్యమని , ఈ ఘటనపై
ఈ వో చట్టపరమైన చర్యలు ఎదుర్కొక తప్పదని , పవన్ కళ్యాణ్ స్వయంగా తాను ఒక స్నేహితుని ద్వారా బాప్తిజం తీసుకున్నట్టు తనకు తాను చెప్పుకున్నా అన్యమతస్తుడైనా పవన్ కళ్యాణ్ తో ఈ వో సంతకం చేయించుకోక పోవటం క్షమించరాని నేరమని ,
” గో ” మాంసం తినండి , నేను తింటాని అని స్వయం ప్రకటన చేసుకున్న పవన్ కళ్యాణ్ పవిత్ర శుద్ధి స్నానం చేయకుండా శ్రీవారి దర్శనం చేయటం ఆఘమ శాస్త్ర నిబంధనలకు అపచారం అని ఈవో కు, వేద పండితులకు తెలియదా ! తెలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా ! నేటి పాలకుల నీచ రాజకీయాలకు శ్రీ వారి పవిత్ర క్షేత్రాన్ని , ఆశేష భక్తుల మనోభావాలను కలుషితం చేయాలనుకోవటం క్షమించారాని ఘోర అపచారంగా భావించాలని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .
పాలన చేతకాకనే దైవ మనోభావాలను రెచ్చగొడుతున్నారని , రాజకీయ విష కాలుష్యానికి అగ్గి రాజేస్తున్నారని , నేటి దద్దమ్మ పాలకులతో ఆంధ్రప్రదేశ్ కు ఒక చక్కటి రాజధాని నిర్మాణాన్ని ఎన్నటికి చూడలేమని, భవిష్యత్ తరాలు కూడా చూడలేరని , యువతకు గంజాయి , ఇతర మత్తు ప్రధార్దాలకు బానిసలుగా మారుస్తు వారిలో యవ్వనాన్ని నిర్వీర్యం చేస్తున్నారని , ప్రశ్నించే యువ యవ్వనాన్ని వ్యూహత్మకంగా సమాధి చేస్తు తిరుగు లేని రాజకీయ ఆధిపత్యాన్ని శాసిస్తున్నారని , కాలం చెల్లిన రాజకీయ వ్యాపారస్తుల కూటమిలతో ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని , యావత్ ఆంధ్రులంతా మన బిడ్డల భవిష్యత్ , భద్రత , సంక్షేమం కోసం నేటి వ్యాపార రాజకీయ పార్టిలకు బుద్ది చెప్పే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టి సారథ్యంలో నూతన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి నిర్మాణంకై నిర్మాణాత్మకమైన దృష్టి సారించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .
ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , ఎమ్ డి హుస్సేన్ , దూడ్డే త్రినాద్ , కారుమూరి యుగంధర్, సుంకర వెంకట భాస్కర రంగారావు , దూడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , దోషి నిషాంత్ ,వల్లి శ్రీనివాసరావు , అల్లాడ రమేష్ కుమార్ , బత్తెన శివన్నారాయణ, సమ్మెంగి తేజ, మాసా అప్పాయమ్మ, అడపా శేషగిరి, తదితరులు పాల్గొనియున్నారు.