నిర్మల్ , సెప్టెంబర్ 23 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి
కుబీర్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు సోమవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం
నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాకూర్ దత్తు సింగ్ మరియు
ముధోల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ,విద్యార్థు లేని పోనీ వ్యసనాలను అలవాటు చేసుకోకూడదని, తల్లిదండ్రులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, విద్యార్థులకు గుర్తు చేశారు. గంజాయి, సిగరెట్, వైన్, గుట్కా లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటికి ఆకర్షితలయితే మన జీవితం నాశనమవుతుందని, అయినట్టయితే తల్లిదండ్రులు తట్టుకోలేరని, అదికాక ఆసుపత్రులలో లక్షల రూపాయలను వెచ్చించవలసి ఉంటుందని, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా వారికి పేరు తీసుకోవచ్చేలా, విద్యను అందిస్తున్న గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపత్, హనుమంతరావు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.