E-PAPER

నూతన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

బూర్గంపాడు,సెప్టెంబర్23 వై సెవెన్ న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు .అనంతరం నూతన పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. పాయం స్థానికులతో మాట్లాడుతూ, నూతన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, కార్యాలయంలోని సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా సేవ చేయాలని తెలియజేసి, అనంతరం
రాష్ట్ర జర్నలిస్ట్ రాష్ట్ర చైతన్య సభ పత్రాన్ని అందజేసిన జర్నలిస్ట్ లు అనంతరం పంచాయతీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం.ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :