మిర్యాలగూడ,సెప్టెంబర్ 23 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ప్రతి సోమవారం ప్రజవాణి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తెలిపారు.అందులో భాగంగా సోమవారం డివిజన్ పరిధిలోని అధికారుల అందరితో కలిసి ప్రజవాణి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ సమస్యలు ఉన్న నేరుగా నన్ను కలవచ్చని,
ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వొచ్చని, అట్టి దరఖాస్తులపై తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ హరిబాబు , ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Post Views: 54