మిర్యాలగూడ, సెప్టెంబర్ 23 వై7 న్యూస్ ప్రతినిధి;
AIFDY నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
మిర్యాలగూడలో రాష్ట్రస్థాయి యువజన విస్తృతస్థాయి సమావేశం కరపత్రం జిల్లా అధ్యక్షులు పసుపుల కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో నిరుద్యోగ సమస్య పెను సవాలుగా మారిందన్నారు. కులమత మూఢ విశ్వాసాలు, మత్తు పదార్థాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు విష సంస్కృతితో యువతను పాలకులు తప్పుడు దారి పట్టిస్తున్నారన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా దేశాన్ని పాలిస్తూ యువతి యువకుల సమస్యలను ఏమి కూడా పరిష్కరించలేదన్నారు. భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28వ తేదీన వరంగల్ ఓంకార్ భవన్ లో జరిగే AIFDY రాష్ట్రస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాశి, మోహన్, భరత్, వంశి, బన్నీ, నాని పాల్గొన్నారు