E-PAPER

బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం ఆద్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిరాహార దీక్ష

.బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు
గాదగోని మహేష్ గౌడ్

మిర్యాలగూడ,సెప్టెంబర్ 23 వై7 న్యూస్ ప్రతినిధి;

మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర బీసీల 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం ఆద్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు .ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు
గాదగోని మహేష్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన, నేటికీ అమలు చేయలేకపోతున్నారని, ప్రస్తుతం రానున్న మున్సిపల్, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలకు ఈ సవరణ చేసి 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, అంతే బీసీ విద్యార్థులకు ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ 4500 కోట్లు బకాయి ఉందని, దానిని వెంటనే ఫీజు రీయంబర్స్మెంట్ చేసి బీసీ విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జె ఎస్ సి కన్వీనర్ మారం శ్రీనివాస్ , కోళ్ల సైదులు , జయరాజ్ , కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , నల్లగంతుల నాగభూషణం , బాసాని గిరి , సామాజికవేత్త డాక్టర్ రాజు ,పెద్ది శ్రీనివాస్ గౌడ్ ,బంటు సైదులు ,కుర్ర పిడత సురేష్ , నడ్డి శివకృష్ణ ,మిర్యాలగూడ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బసవయ్య గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ,వెంకన్న గౌడ్ , భీమరాజు , దుర్గయ్య ,
అన్ని కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :