బూర్గంపాడు,సెప్టెంబర్23 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పర్యటన లో భాగంగా బూర్గంపాడు మండల కేంద్రంలో గల సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హాస్పిటల్ ల్లో ఉన్న వసతులను,అలాగే హాస్పిటల్లో ఉన్న సిబ్బంది పని తీరుని సమీక్షించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిబ్బంది కి ఎటు వంటి సదుపాయలు కావాలన్నా తాను చూసుకుంటా అని కాని ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ గాని స్టాఫ్ నర్స్ లు గాని మండల కేంద్రంలోనే అందుబాటులోనే ఉండాలని సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న తరుణంలో ఆశ వర్కర్లను అప్రమత్తం చేస్తూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలను ఆరోగ్యం కాపాడేలా చర్యలు చెప్పటాలని వైద్య సిబందికి తెలియజేసారు.అనంతరం రక్త పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పేషంట్లతో మాట్లాడి వారు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గ గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమం లో,మెడికల్ సిబ్బంది మండల నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.