E-PAPER

రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్

రుద్రూర్ , ఆగస్టు 31 వై 4 న్యూ

బాన్సువాడ నియోజకవర్గం లోని రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫుడ్ అండ్ టెక్నాలజీ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థి సంఘాల నాయకులూ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరపూర్ రవీందర్ గౌడ్ , తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థిని మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించడం రుద్రూర్ సిఐ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వాళ్లు అగ్రికల్చర్ కళాశాల వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మాటలు గాని విద్యార్థి సంఘాల మాటలు గాని వినకుండా విద్యార్థి సంఘాల పైన చేయి చేసుకోవడం విద్యార్థి సంఘాల పైన మండిపాటు ఎందుకని ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తీసుకు వచ్చే ఆలోచన సిఐ కి తగదని నీ సొంత నిర్ణయం మేరకు ఆగమేఘాల పైన మృతదేహాన్ని తరలించడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా కూడా విద్యార్థి సంఘాల నేతలపై చేయి చేసుకోవడం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అలాగే వెంటనే కళాశాల హాస్టల్ ప్రిన్సిపల్ ని వార్డెన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం కానీ లేదా వాళ్ళ కుటుంబంలో ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ లేనియెడల జిల్లా కలెక్టర్ ఆఫీసుని , తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరిస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్