హైదరాబాద్,ఆగస్టు31 వై 7న్యూస్
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు సీఎస్ పలు సూచనలు చేశారు. ‘‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కలెక్టరేట్లు, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. లోతట్టు, వరద ప్రాంతాలకు ప్రజలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలి. ఉద్ధృతంగా ప్రవహించే వాగుల వద్ద ఒక అధికారిని పెట్టి పర్యవేక్షించాలి. స్కూళ్లకు సెలవులపై పరిస్థితిని బట్టి కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలి. మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యబృందాలను అప్రమత్తం చేయాలి. హైదరాబాద్‌లో మ్యాన్ హోళ్లు తెరవకుండా నిఘా పెట్టాలి’’ అని సీఎస్ తెలిపారు.









