. దరఖాస్తులు స్వీకరిస్తున్న జేఎస్టీయూసీ
హైదరాబాద్ నగరంలోని అనేక బస్తీల్లో కిరాయికి ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు సొంత ఇల్లు కోసం దరఖాస్తులు సమర్పించడానికి జై స్వరాజ్ పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వివిధ కాలనీలకు చెందిన ఇల్లు లేని భవన నిర్మాణ కార్మికులు ప్రతి రోజూ తమ దరఖాస్తులను కార్యాలయంలో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ కి దరఖాస్తులను అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న అర్హులైన భవన నిర్మాణ కార్మికుల అందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు లేదా 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలనే డిమాండ్ తో జై స్వరాజ్ పార్టీ, జేఎస్టీయూసీ ఉద్యమ కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అర్హులైన ఇల్లు లేని భవన నిర్మాణ కార్మికుల నుంచి దరఖాస్తులను సేకరించి వాటిని ఆ కార్మికులతో సంబంధించిన మండల అధికారులకు జేఎస్టీయూసీ రాష్ట్ర నాయకులు దగ్గర ఉండి అందించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతున్నది. భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హైదరాబాద్లోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్మిక సంఘం సమావేశంలో జేఎస్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం అన్నారు. జేఎస్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ కార్మికుల నుంచి దరఖాస్తులను సేకరించడంలో చురుకుగా పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు లేదా లేదా 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు హైదరాబాదులోని మల్కాజిగిరి లోని వినాయక్ నగర్ కు చెందిన భవన నిర్మాణ కార్మిక ఎం. శ్రీను, బి. సోమయ్య, ఆర్. మాధవులు, సీహెచ్ ప్రకాష్, సీహెచ్ యాకయ్య, పి. శ్రీను, ఈ. స్వామి, ఎం. సోమన్న, ఎం. ముత్తు, జె. శ్రీకాంత్, కె. కిరణ్ కుమార్, బి. సుధాకర్, ఎం రజిత తదితరులు జై స్వరాజ్ పార్టీలో చేరారు. అలాగే అనేక మంది అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు చెందిన దరఖాస్తులను నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, జేఎస్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.