. కలెక్టర్ గారు స్పందించాలి
. తప్పు చేసిన అధికారుల పట్ల కలెక్టర్ గారి నిర్లక్ష్యం సరికాదు…..
. తప్పు చేసిన అధికారులను ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు.బాధిత ప్రజలకు సమాధానం చెప్పాలి…..
. ఉపాధి పనిలో నష్టపోయిన గొంపల్లి గ్రామ ప్రజలకు న్యాయం జరగాలి
. లేని ఎడల బాధిత ప్రజలకు న్యాయం జరగడం కోసం పోరాటాన్ని ఉదృతం చేస్తాం
. ప్రజాపంధా పార్టీ చర్ల మండల కమిటీ డిమాండ్…..
చర్ల, ఆగస్ట్ 27 వై7 న్యూస్
చర్ల మండల పరిధిలోని గొంపల్లి గ్రామ ప్రజలు గత కొంతకాలం క్రితం ఉపాధి హామీ పనిలో కష్టపడటం జరిగిందని ఆ చేసిన కష్టానికి సంబంధించిన పైసలను వాళ్లకు దక్కకుండా సంబంధిత అధికారులు సొమ్మును మొత్తం కాజేసి పక్కదోవా పట్టించారని అలాంటి తప్పుడు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని మంగళవారం ప్రజాపంధా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ గతంలో ఈ సమస్యపై స్థానిక సంబంధిత అధికారుల కార్యాలయాలను పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగిందని అన్నారు. స్థానిక సంబంధిత అధికారులు ఇట్టి సమస్యపై స్పందించి గ్రామాలలోకి వచ్చి ఉపాధి పనిలో జరిగిన అవకతవకల పట్ల ప్రజలకు జరిగిన నష్టం పట్లా సర్వే కూడా నిర్వహించడం జరిగిందని ఆ సర్వేలో సంబంధిత అధికారులు తప్పు చేశారని నిర్ధారణ కావడంతో 15 రోజులలో వారిని సస్పెండ్ చేస్తాం అని బాధిత ప్రజలకు హామీ ఇవ్వడం తో ఆందోళనలను విరమిచడం జరిగిందని తెలిపారు. కాలక్రమేణా అధికారులు ప్రజలకు ఇచ్చిన 15 రోజుల గడువు ముగియ్యడంతో స్థానిక అధికారుల పనితీరు సర్వేకే పరిమితం అయ్యిందని అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగిందని తెలిపారు. అనంతరం స్పందించిన కలెక్టర్ కార్యాలయం అధికారులు కాలక్రమేనా ఈ సమస్యకై చర్లకు సర్వేకు వచ్చి సర్వేలో అధికారులు తప్పు చేసారని నిర్ధారించడం జరిగిందని బాధిత ప్రజలతో ముకాముకి చేర్చలు జరిపి నష్టపోయిన బాధిత ప్రజలకు కచ్చితంగా న్యాయం చేస్తామని తప్పుడు అధికారులను సస్పెండ్ చేస్తామని హాని ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.కానీ ఇప్పటికి 3 నెలలు కాలం గడుస్తున్నా బాదిత ప్రజలకు న్యాయం జరగలేదనిఆయన మండిపడ్డారు. సర్వేలు దేనికి చేశారని నష్టపోయిన ప్రజలకు న్యాయం చెయ్యడానికా, లేక తప్పుడు అధికారులను కప్పిపుచ్చెoదుకా, అని ఆయన ప్రశ్నించారు.కరువు పనిలో కూడా కక్కుర్తి పడ్డ తప్పుడు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి నష్టపోయిన బాధిత ప్రజలకు న్యాయం చెయ్యాలని ఆయన అన్నారు. కలెక్టర్ గారు స్పందించాలని ఇలాంటి తప్పుడు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. లేని ఎడల ఉద్యమబాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు నాగమణి, పున్నారావు ,సూరమ్మ, మంగ వేణి, నరసింహమూర్తి, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.









