E-PAPER

చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్ పై చర్యలు ఏవి?

. విద్యార్థులను పిడి గుద్దులు గుద్దుతూ విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన ,సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

. జిల్లా కలెక్టర్ స్పందించాలి.

. కృష్ణాష్టమి రోజు కొంతమంది విద్యార్థుల్ని పిలిపించుకొని విచారణ ఏమిటి?

. విషయాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రిన్సిపల్. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

. PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి
మునిగేల శివ ప్రశాంత్

చర్ల, ఆగస్ట్ 27 వై 7 న్యూస్

ఈరోజు చర్ల జూనియర్ కళాశాల లో PDSU బృందం విద్యార్థులతో విచారణ చేసిన సందర్భంగా PDSU మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ,గత రెండు రోజుల కిందట చర్ల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా బోధనలు చెప్పే లెక్చరర్ విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అమ్మాయిలను చూడకుండా ఒంటిపై పిడి గుద్దులు గుద్దుతూ లెక్చరర్ కి నచ్చిన రీతిలో విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా మిత్రులు వెళ్లి విద్యార్థిని ఎందుకు అలా జరిగిందని వివరణ అడగగా దురుసుగా ప్రవర్తించి అక్కడ నుంచి వెళ్లిపోయిన లెక్చరర్ విద్యా బోధనలో ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండు రోజులు గడిచిన లెక్చరర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సంబంధిత అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చర్ల జూనియర్ కళాశాలలో గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగిన క్షమాపణలు చెప్పుకొని తప్పు ఒప్పుకున్న లెక్చరర్స్ కూడా ఉన్నారు. అప్పుడు కూడా అలాగే దురుసుగా ప్రవర్తించిన ఉన్నత జిల్లా అధికారులు పట్టించుకోకపోవడమే మరొకసారి ఈ సంఘటన జరిగింది అని ఆయన అన్నారు. నోడల్ ఆఫీసర్ నిన్న కృష్ణాష్టమి అయినప్పటికీ విద్యార్థులకు పబ్లిక్ హాలిడే అయినా కొంతమంది విద్యార్థిని, విద్యార్థులను పిలిపించుకొని విచారణ చేశానని జిల్లా అధికారి చెప్తున్నారని లెక్చరర్ ని కాపాడుకోవడం కోసం సెలవు రోజు విచారణ చేయడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు అందరూ ఉన్నప్పుడు సమగ్ర విచారణ చేసి చట్టపురమైన చర్యలు తీసుకున్న తీసుకోవాలని ఆయన కోరారు.

. విద్యార్థుల వివరణ

ఈరోజు అనగా 27.08.24. విద్యార్థులతో PDSU బృందం మాట్లాడినప్పుడు విద్యార్థులు మాపై అసభ్యంగా మాట్లాడారని ఒంగోపెట్టి పిడుగులు గుద్దుతాడని ఇబ్బందులకు గురి చేస్తాడని. విద్యార్థులు PDSU నాయకత్వానికి వివరించడం జరిగినది.
ఈ విషయాలన్నీ చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఇట్టి విషయంపై పూర్తి విచారణ చేసి లెక్చరర్ పై అలాగే పక్కదారి పట్టిస్తున్న ప్రిన్సిపల్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రోజు రోజుకి కళాశాలల్లో స్కూళ్లలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న లెక్చరర్స్ టీచర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదో ఒక మండలంలో వెలుగులోకి వస్తున్నాయని ఇవన్నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు స్పందించి శాఖపరమైన చర్యలు , చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో PDSU డివిజన్ నాయకులు తెల్లం శరత్, ఆలం సంజు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్