E-PAPER

పినపాక ఎమ్మెల్యే పాయం ని కలిసిన తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు

మణుగూరు,ఆగస్టు 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మణుగూరు డివిజన్ నూతన కమిటీగా ఎన్నుకోబడిన నూతన కమిటీ సభ్యులు బుధవారంఎమ్మెల్యే పాయం ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి నూతన కమిటీ వివరాలను తెలియజేశారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి తదుపరి ఫారెస్ట్ అధికారులతో పలు సమస్యలపై చర్చించారు. అడవిని నమ్ముకుని బ్రతికే ట్రైబుల్స్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చెయ్యొద్దని అడవులను కొట్టడం వలన కలిగే నష్టాలను గిరిజనులకు పూర్తి అవగాహనను కల్పించాలని పోడు భూములపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పట్టాలను అందజేస్తుందని అంతవరకు గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దని ఫారెస్ట్ అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ యొక్క కార్యక్రమానికి ఎఫ్డిఓ సయ్యద్ మసూద్ గారు,ఫారెస్ట్ అధికారులు,మరియు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News