కామారెడ్డి జిల్లా
వై 7 న్యూస్ తెలుగు పత్రిక
ఆగస్టు: 25-08-2024
బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి మండల కేంద్రలో ఈరోజు పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
ముందుగా కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసి) నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతన చైర్మన్ గైక్వాడ్ హన్మంతు మరియు పాలకవర్గ సభ్యులకు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు .
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ అధికారులతో రైతువేదిక లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోచారం భాస్కర్ రెడ్డి అభిమానులు నిర్వహించిన PBR వాలీబాల్ టోర్నమెంట్ హాజరై ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, రైతులు, క్రీడాకారులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.